
ఘనుఁ డీఁతఁడొకఁడు గలుగఁగఁగదా వేదములు
॥పల్లవి॥ ఘనుఁ డీఁతఁడొకఁడు గలుగఁగఁగదా వేదములు జననములుఁ గులము లాచారములుఁ గలిగె is-aber.net ॥చ1॥ కలుషభంజనుఁ డితఁడు గలుగఁగఁగదా జగతిఁ గలిగె నిందరి జన్మగతులనెలవు మలసి యుతఁడొకఁడు వొడమఁగఁగదా యిందరికి నిలువ నీడలు గలిగె నిధినాధానములై ॥చ2॥ కమలాక్షుఁ డితఁడు గలుగఁగఁగదా దేవతలు గమిగూడి రిందరును గండిగడచి ప్రమదమున నితఁడు నిలుపఁగఁగదా సస్యములు అమర ఫలియించె లోకానందమగుచు ॥చ3॥ గరిమె వేంకటవిభుఁడొకఁడు గలుగఁగఁగదా ధరయు నభమును రసాతలము గలిగె పరమాత్ముఁడితఁడు లోపల గలుగఁగాఁగదా అరిది చవులును హితవు లన్నియునుఁ గలిగె |
రాగము: శుద్దవసంతం రేకు: 0019-04 సంపుటము: 1-116 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శుద్దవసంతం