
జిల్లా గ్రంధాలయ సంస్థకు కొత్త పాలకవర్గం
కడప: జిల్లా గ్రంధాలయ సంస్థకు కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు (జీవో ఆర్.టీ. నెంబరు 179, విద్యాశాఖ) విడుదల చేసింది. జమ్మలమడుగుకు చెందిన జంబాపురం వెంకటరమణారెడ్డి చైర్మన్ గా, కోడూరు వాసి కొండూరురాజు ప్రతాపరాజు, ప్రొద్దుటూరుకు చెందిన జింకా సుబ్రహ్మణ్యం, కడప చెందిన షామీర్ బాష, మైదుకూరుకు చెందిన అందే పాపయ్య గారి రవీంద్ర, గొడిగనూరుకు చెందిన బైసాని ప్రతాప్ రెడ్డి, కమలాపురంకు చెందిన సులేఖ సభ్యులుగా నియమితులయ్యారు.