కడప జిల్లాలోని చారిత్రక ప్రదేశమైన గండికోట పరిసరాల్లో సంచరిస్తూ, గొర్రెలనూ,మేకలనూ చంపివెస్తున్న క్రూరజంతువు పులికాదని, అది హైనా అనే జంతువని అటవీ అధికారులు స్పష్టం చేశారు. గండికోట పరిసరాలనూ, పెన్నా లోయనూ పరిశీలించిన అధికారు ఈ మేరకు ఈ ప్రకటన చేశారు. జంతువు పాదముద్రలను గుర్తించిన అధికారులు ఆ పాదముద్రలు హైనా అనే జంతువు పాదముద్రలుగా పేర్కొన్నారు.
హైనాను పట్టుకుని జంతు ప్రదర్శన శాలకు తరలించే ప్రయత్నాలను అధికారులు ప్రారంభించారు. హైనా కు సంబంధించిన వివరాలు 28-08-2010 లో అంధ్ర ప్రభ దినపత్రిక? -(రేవతి) లో ప్రచురించారు. ఆ వివరాలు ఇలా వున్నాయి.
1. ‘హైనా’…ఇది ఒక జంతువు. దీని రూపం కుక్క, నక్క, తోడేళ్ళను పోలి వుంటుంది, తల పెద్దదిగా వుంటుంది.
2. ‘హైనా’ నవ్వుతుందా (ది)?..నవ్వదండీ… అరుస్తుంది… దాని అరుపే నవ్వులా వుంటుందట! కొందరు నవ్వితే వినసొంపుగా (ఆహ్లాదకరంగా) వుంటుంది. కాని హైనా నవ్వితే మాత్రం చాలా చిరాగ్గా.. పిచ్చివాళ్ళ నవ్వులా… కర్ణ కఠోరంగా వుంటుంది.
జువాలజిస్టులు దీని నవ్వుకు… అరుపుకు ”గిగ్గింగ్” అని పేరు పెట్టారు.
3. హైనా ‘జంగిల్ స్కావెంజర్’అలా ఎందుకంటారు ?
ఇది అడవిని శుభ్రపరుస్తుంది… అంటే చీపురు పెట్టి తుడవదు. మృగరాజు… సింహం వేటాడిన జంతువును పూర్తి గా తినదు, కొంత తిని వదిలెయ్యడం దాని అల వాటు. సింహంలాంటి జంతువులు తిని వదిలేసిన భాగాన్ని హైనా పూర్తిగా తినేస్తుంది. అడవిని అలా శుభ్రం చేస్తుందన్నమాట! దీనికి ‘చెదపురుగులు’ అంటే ఎంతో ఇష్టం. ఒక్క రాత్రిలో రెండు లక్షల చెదపురుగులు తినేస్తుంది. ఇలా కూడా అడవిని శుభ్రం చేస్తుంది.
4. హైనా వేటాడదా… ఎంగిలి కూళ్ళు తినడమేనా ?
హైనా వేటాడుతుంది. కాకపోతే, ఏ జం తువును వేటాడినా ఆనందంగా నవ్వు తుంది… అదే అరుస్తుంది. దాం తో చుట్టు ప్రక్కల వున్న ఏ సింహ మో వచ్చి అది వేటాడిన జంతు వును దౌర్జన్యంగా తినేస్తుంది.
5. హైనా శత్రువులను ఎదుర్కోదా? ఎదుర్కుంటే ఎలా?
శత్రువు ఎదు రైతే దీని వెంట్రు కలు నిక్కబొడుచు కుంటాయి. అప్పుడు దాని శరీరం నుండి భరించలేనంత దుర్వాసన వెలువడుతుంది. ఎదురు పడిన శత్రువు ఆ వాసన తట్టుకోలేక పారిపోతుంది. ఒకవేళ శత్రువు గట్టిగా నిలబడితే మాత్రం ‘హైనా’నే తోక ముడుస్తుంది. (పారిపోతుంది) హైనా వట్టి పిరికిది. అందులో ‘ఆర్డ్‌వోల్ఫ్’ అనే రకం హైనా మరీ ”పి..రి..కి..ది”ట !
గండికోట, పరిసరాల్లో ఏయే జంతువులు సంచరించేవి, సంచరిస్తుంటాయి అన్న విషయం ‘గండికోట” పుస్తకం (రచయిత: తవ్వా ఓబులరెడ్డి, విశాలాంధ్ర వారి ద్వారా లభ్యం)లో ప్రస్తావించబడింది.