కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ” వారసత్వ కట్టడాల దత్త స్వీకారం’ పథకం కింద కడప జిల్లాలోని ప్రఖ్యాత చారిత్రిక కట్టడమైన గండికోటను దాల్మియా సంస్థ దత్తతకు తీసుకుంది. గండికోట తో పాటు దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన దిల్లీ లోని ఎర్రకోట ను కూడా దాల్మియా సంస్థ దత్తత తీసుకుంది. ఈ నిర్ణయం పై పలు రాజకీయ పక్షాలు , చరిత్ర కారులలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈమేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దాల్మియా సంస్థ ఐదేళ్లపాటు 25 కోట్ల రూపాయలతో కోటలో పర్యాటకులకు సౌకర్యాలను కల్పించడం, పర్యాటక పరంగా మౌలిక వసతులను మెరుగుపరచడం, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం , పర్యాటకులకు మంచినీళ్ళు, వసతి సౌకర్యాలను మెరుగు పరచడం లాంటి చర్యలను దాల్మియా సంస్థ చేపడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గండికోటకు ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న పర్యాటకులకు, చరిత్రకారులకు ఈ నిర్ణయం తీవ్ర నిరాశనే మిగిల్చింది.