మంగళవారం , 3 డిసెంబర్ 2024

భక్తుల కొంగు బంగారం ఈ గంగమ్మ

కడప నగరానికి కూతవేటుదూరంలో గల సికెదిన్నె మండలంలోని కొత్తపేట వద్ద గల గంగమ్మతల్లి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలే కాక, జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని, అ మ్మవారికి తమ మొక్కులు చెల్లించి బోనాలు సమర్పించుకుంటున్నారు.

గంగమ్మ తల్లి
గంగమ్మ తల్లి

దీంతో ప్రతి ఆదివారం ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరిగి పండుగ వాతావర ణం నెలకొంటుంది. ఇక్కడి వచ్చి అనేక మంది తమ కోర్కెలతో వచ్చి అమ్మవారికి విన్నవించి, అవి నెరవేరిన వెంటనే వారి కుటుంబ, బంధుగణం తో వచ్చి అమ్మవారికి కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

చదవండి :  రేపూ...మన్నాడు ఆస్థానే మురాదియాలో ఉరుసు ఉత్సవాలు

రోడ్డు సౌకర్యం

గతంలో గంగమ్మ ఆలయానికి సరైన రోడ్డు సౌకర్యం లేక భక్తులు కేవలం తిరుణాళ్ల జరిగే రోజుల్లో మాత్రమే వచ్చి పోయేవారు.

ప్రస్తుతం కడప-రాయచోటి ప్రధాన రహదారి నుండి ఆలయం వద్దకు దాత ఇనుగోలు రామచంద్రయ్య తమ పొలంలో దారి ఇవ్వడంతో అక్కడ ప్రస్తుతం సిమెం ట్ రోడ్డు వేసి, గంగమ్మ ఆలయ స్వాగ త ద్వారం ఏర్పాటు చేయడంతో భక్తు లు సౌకర్యవంతంగా ఉంది.

దీంతో వివిధ వాహనాల్లో భక్తులు నేరుగా ఆలయం వద్దకు చేరుకునేందుకు అవకాశం ఏర్పడింది. మరోవైపు మూలవంక వద్ద నుంచి వచ్చే రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు తొలగించి రోడ్డు ని ర్మించడంతో రెండువైపులా నుంచి భక్తులు వస్తున్నారు.

చదవండి :  కనుల పండువగా కోదండరాముని రథోత్సవం

ఇక్కడి ప్రత్యేకత

గంగమ్మ తల్లి ఆలయం ఏటా మహాశివరాత్రి అనంతరం మూడోరోజు, నాలుగవరోజు గంగమ్మ తిరుణాళ్ల నిర్వహిస్తుంటారు. అనంత రం ఉగాది వరకు ప్రతి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తిరుణాళ్లలో భాగంగా అమ్మవారికి కళ్యాణం జరిపించడం ఇక్కడి ప్రత్యేకత. రాత్రి సమయంలో కళ్యాణం జరిపించినా అధిక సంఖ్యలో చుట్టుప్రక్కల వారు వచ్చి తిలకిస్తుంటారు. దేవాదాయశాఖ వారు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.

అధికారులు సైతం భక్తులకు సౌకర్యాలు కల్పించుటకు కృషి చేస్తున్నారు.

ఇదీ చదవండి!

అనంతపురం గంగమ్మ దేవళం

ముగిసిన అనంతపురం గంగ జాతర

అనంతపురం గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతర సోమవారం సాయంత్రం ఘనంగా ముగిసింది. శనివారం తెల్లవారు జామున …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: