
కోరుదు నామది ననిశముగుణాధరు నిర్గుణుఁ గృష్ణుని
॥పల్లవి॥ కోరుదు నామది ననిశముగుణాధరు నిర్గుణుఁ గృష్ణుని నారాయణు విశ్వంభరు నవనీతాహారు ॥చ1॥ కుండలిమణిమయభూషణు కువలయదళవర్ణాంగుని- నండజపతివాహనుని నగణితభవహరుని మండనచోరకదమనుని మాలాలంకృతవక్షుని నిండుకృపాంబుధిచంద్రుని నిత్యానందునిని ॥చ2॥ అగమపుంజపదార్థుని ఆపత్సఖసంభూతుని నాగేంద్రాయతతల్పుని నానాకల్పునిని సాగబ్రహ్మమయాఖ్యుని సంతతగానవిలోలుని వాగీశ్వరసంస్తోత్రుని వైకుంఠోత్తముని ॥చ3॥ కుంకుమవసంతకాముని గోపాంగనకుచలిప్తుని శంకరసతిమణినుతుని సర్వాత్ముని సముని శంకనినాదమృదంగుని చక్రాయుధవేదీప్తుని వేంకటగిరినిజవాసుని విభవసదాయినిని |
రాగము: మలహరి రేకు: 0023-05 సంపుటము: 1-141 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, మలహరి