ఒంటిమిట్ట కోదండ రామాలయం
గవర్నర్ చేతులమీదుగా కోదండరామ కళ్యాణం
ఒంటిమిట్ట : కోదండరాముని కల్యాణాన్ని ఏప్రిల్ 2న గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ సహాయ కమిషనరు శంకర్‌బాలాజీ చెప్పారు. శుక్రవారం ఒంటిమిట్టలో పాత్రికేయులతో మాట్లాడుతూ… చేత్తో ఒలిచిన బియ్యం గింజలతో సీతారాముల తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. చేత్తో ఒలిచిన బియ్యం గింజలను చుట్టుప్రక్కల గ్రామస్థులు 27 వరకూ తెచ్చి ఇవ్వవచ్చునన్నారు.
ఈ ఏడాది నూతనంగా ప్రవేశ పెట్టే ఈ ఆచారాన్ని విజయవంతం చేయాలన్నారు. కల్యాణంలో పాల్గొనదలచిన 25లోగా భక్తులు రూ. వెయ్యి చెల్లించి టిక్కెట్ పొందవచ్చన్నారు.