కొలువుఁడీ భక్తిఁ గొండలకోనేటి-

॥పల్లవి॥
కొలువుఁడీ భక్తిఁ గొండలకోనేటి-
నిలయుని శ్రీనిధియైనవాని
॥చ1॥
ఆదిదేవుని నభవుని సామ-
వేదనాదవినోదుని నెర-
వాది జితప్రియ నిర్మలతత్త్వ-
వాదులజీవనమైనవాని
॥చ2॥
దేవదేవుఁడైన దివ్యుని సర్వ-
భావాతీతస్వభావుని
శ్రీవేంకటగిరి దేవుఁడైన పర-
దేవుని భూదేవ తత్పరుని
రాగము: సామంతం
రేకు: 0006-07
సంపుటము: 1-44

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం

చదవండి :  దొరుకునా యితని కృప తుదిపదంబు - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: