కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు – అన్నమయ్య సంకీర్తన

కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు
యిందరిలోపల నీవెడమాయలు యేగతిఁ దెలిసే నేనయ్యా
॥చ1॥
దూరము కర్మమునకు జ్ఞానము తోడనే వొండకటికిని
దూరము పరమునకు బ్రపంచము తొలుత విరుద్ధంబు;
దూరము విరతికి సంసారము; తుదమొదలే లేదు;
యీరీతుల నీ వెడమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా
॥చ2॥
కూడదు దేహమునకు నాత్మకు గోత్రవిరోధం; బెన్నఁడును
కూడదు కోపమునకు శాంతము గుణావగుణములను;
కూడదు బంధమునకు మోక్షము కోరికలే కట్లుగాన;
యేడ గొలఁదిగా శ్రీహరిమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా
॥చ3॥
శ్రీ వేంకటపతి నన్నీ గతిఁ జిక్కించితి వీజగమునను;
భావింపఁగరాదు నీమహిమ బహుముఖములయర్ధముగాన;
యేవిధమును నేఁటికి నాకిఁక యెందెందని తగిలెద నేను
దైవికమగు నీదాసానుదాస్యము దక్కినదే నాకు
రాగము: బౌళి
రేకు: 0080-03
సంపుటము: 1-384

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి

చదవండి :  నాపాలి ఘన నిధామవు నీవే నన్ను

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: