
కొంచెమును ఘనముఁ గనుఁగొననేల – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కొంచెమును ఘనముఁ గనుఁగొననేల హరిఁదలఁచు పంచమహపాతకుఁడే బ్రహ్మణోత్తముఁడు ॥చ1॥ వేదములుచదివియును విముఖుఁడై హరికథల నాదరించనిసోమయాజికంటె యేదియునులేనికులహీనుఁడైనను విష్ణు పాదసేవకుఁడువో బ్రహ్మణోత్తముఁడు ॥చ2॥ పరమమగువేదాంతపఠన దొరకియు సదా హరిఁదలఁచలేని సన్న్యాసికంటె మరిగి పసురముఁదినెడిమాలయైనను వాఁడె పరమాత్ముఁ గొలిచినను బ్రహ్మణోత్తముఁడు ॥చ3॥ వినియుఁ జదివియు రమావిభునిఁ దలఁపక వృథా తనువు వేఁపుచుఁ దిరుగతపసికంటె చనవుగల వేంకటేశ్వరుదాసులకు వెంటఁ బనిదిరుగునధముఁడే బ్రహ్మణోత్తముఁడు |
రాగము: శ్రీరాగం రేకు: 0064-02 సంపుటము: 1-329 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం