గురువారం , 21 నవంబర్ 2024

కెసి కెనాల్ ప్రవాహ మార్గం

కెసి కెనాల్ అనేది కడప , కర్నూలు జిల్లాలకు సాగునీరు పారించే ఒక ప్రధాన కాలువ. కృష్ణా నది ఉపనది అయిన తుంగభద్ర నది నుండి సాగునీటిని తీసుకునేందుకు ఉద్దేశించిన కాలువ ఇది. కెసి కెనాల్ ప్రవాహ మార్గం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం…

ప్రారంభ స్థలం: సుంకేసుల ఆనకట్ట (తుంగభద్ర)

ప్రవాహ మార్గం :

సుంకేసుల బ్యారేజీ (0 కి.మీ వద్ద)–> కర్నూలు –> పూడూరు –> అల్లూరు –> మల్యాల –> ముచ్చుమర్రి –> జూపాడు బంగ్లా –> కె.సి.కెనాల్ కుడి గట్టు కాలువకు నీళ్ళు వదిలే చోటు (119.50 కి.మీ వద్ద, అలగనూరు జలాశయానికి నీళ్ళు తీసుకువెళ్ళడానికి ఈ కుడిగట్టు కాలువను నిర్మించారు. వరద సమయంలో, కెసి కెనాల్ ఆయకట్టు పరిధిలో నీటి వినియోగం తక్కువగా ఉన్న సమయంలో ఈ కుడి గట్టు కాలువకు నీళ్ళు వదిలి వాటిని అలగనూరు జలాశయంలో (నిల్వ సామర్థ్యం: 2.96 టిఎంసిలు) నిల్వ చేస్తారు. ఈ అలగనూరు జలాశయం రాజోలి ఆనకట్టకు దిగువన కెసి కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడానికి ఉద్దేశించిన జలాశయం.) –> లాకిన్ సుల (120.90 కి.మీ వద్ద, ఇక్కడే నిప్పుల వాగులో కలిసే చోటు) –> బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ క్రింద (ఇక్కడ నిప్పులవాగు గాలేరులో కలుస్తుంది) –> సంతజూటూరు ఆనకట్ట (150.56 కి.మీ వద్ద)  (ఇక్కడ నిప్పులవాగు ద్వారా కాకుండా వచ్చిన కెసి కాలువ గాలేరులో కలుస్తుంది. సంతజూటూరు ఆనకట్ట నుండి అటు కెసి కెనాల్ కు ఇటు కుందులోకి నీటిని విడుదల చేయవచ్చు. మళ్లించిన నీరు కెసి కాలువ ద్వారా ప్రయాణిస్తుంది. కిందికి వదిలిన నీరు గాలేరు ద్వారా ప్రయాణించి కుందు నదిలో కలిసి అక్కడి నుండి రాజోలి ఆనకట్ట చేరుతుంది) –> బి కోడూరు –> నంద్యాల –> ఆళ్లగడ్డ –> రాజోలి ఆనకట్ట(234.64 కి.మీ వద్ద, సంతజూటూరు ఆనకట్ట వద్ద కిందకు వదిలిన నీళ్ళు కుందు ద్వారా ఇక్కడకు చేరతాయి)  –> వెల్లాల –> దువ్వూరు –> మైదుకూరు –> ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట (290.22 కి.మీ వద్ద, ఇక్కడ పెన్నా నదిలో కలుస్తుంది.) –> ఆలంఖాన్ పల్లె –> దేవుని కడప చెరువు

చదవండి :  రాయలసీమ సాగునీటి కేటాయింపులు (బచావత్ అవార్డు)

ముగింపు స్థలం: దేవుని కడప చెరువు

కె.సి.కెనాల్ మ్యాపు:

 

ఇదీ చదవండి!

పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

గో’దారి’ సరే.. పెన్నా పుష్కరాల ఊసెత్తరేం?

దేశంలోని అన్ని నదులకూ 12 యేళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తే.. పెన్నానదికి ప్రతియేటా ఫాల్గుణ మాసం లో పున్నమి రోజున …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: