
కూడువండుట గంజికొరకా తనకు
॥పల్లవి॥ కూడువండుట గంజికొరకా తనకు వేడుకలుగల సుఖము వెదకుటకుఁగాక ॥చ1॥ కుప్ప నురుచుట కసవుకొరకా తనవు గొప్పయవు టిది మదముకొరకా వొప్పన వేడుకల నొరసి మనసు నెప్పునకురాఁ దివియ నేరవలెఁ గాక ॥చ2॥ కొలుచు దంచుట పొట్టుకొరకా తాఁ గులజుఁడై మూఢుఁడౌ కొరకా తలపోసి యున్నింటఁ దగిలి మీఁదు తెలిసి సుఖదు: ఖములఁ దెలియవలెఁ గాక ॥చ3॥ కొండ దవ్వుట యెలుక కొరకా తాఁ గొండ యెక్కుట దిగుటకొరకా కొండలకోనేటిపతిఁ గొలిచి తనదు నిండి నాపదలెల్ల నీఁగవలెఁ గాక |
రాగము: శ్రీరాగం రేకు: 0019-03 సంపుటము: 1-115 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగం