
కూడులేక యాఁటికిఁ గూరఁ దిన్నట్లు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కూడులేక యాఁటికిఁ గూరఁ దిన్నట్లు ఆడనీడ మోవిచిగురాకు దినేరయ్య ॥చ1॥ దుండగపుఁ బగవారు దోఁచఁగానే తమకాన కొండలెక్కినట్లు సిగ్గు గొల్లఁబోఁగాను దండువెళ్లేమదనునిదాడికి సతులచన్ను- గొండలెక్కి సారెసారె గోడనేరయ్య ॥చ2॥ పొదిగొన్న యలపుతోఁ బొదలుతీగెలక్రింద తుదలేనిభయముతోఁ దూరినట్లు మృదువైనతరుణుల మెఱఁగుబాహులతల.- పొదలెల్లఁ దూరితూరి పుంగుడయ్యేరయ్య ॥చ3॥ వలసగంపలమోపువలె లంపటము మోఁచి తలఁకుచుఁ బారలేక దాఁగినయట్లు యిల వేంకటేశ నిన్నెఱఁగ కింద్రియముల తలవరులిండ్లనే దాఁగేరయ్య |
రాగము: ఆహిరి రేకు: 0038-04 సంపుటము: 1-234 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి