కాలేజీ పిల్లోల్లకు కథ, కవితల పోటీలు

    కాలేజీ పిల్లోల్లకు కథ, కవితల పోటీలు

    తెలుగు భాషా,సంస్కృతుల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా అంతర్జాతీయ తల్లిభాషా దినోత్సవాన్ని పురష్కరించుకుని కాలేజీ పిల్లోల్లకు జిల్లాస్థాయి కథ, కవితల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలుగు సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు , రచయిత తవ్వా ఓబుల్‌‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపినారు.

    మైదుకూరులోని జిల్లా పరిషత్ హైస్కూలులో ఫిబ్రవరి 18 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఈ పోటీలు జరుగుతాయని ఇంటర్, డిగ్రీ, విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. కథలను పల్లెటూర్ల నేపధ్యంగా రైతులు, వ్యవసాయం, సాంఘిక, సాంస్కృతిక జీవనం అంశాలలో ఏదైనా అంశంపై రెండు ఎ4 పేజీలలో రాయాలని, కవితలను కూడా పై అంశాలలో ఏదో ఒక అంశంపై 25 పంక్తులకు మించకుండా నిర్ణీత కేంద్రంలో రాయాల్సి ఉంటుందని తెలిపారు.

    చదవండి :  నంద్యాలంపేట

    కథ, కవిత ప్రక్రియలలో రెండింటిలో కూడా విద్యార్థులు పాల్గొనవచ్చునని, కథల పోటీ 9.30 నుండి 11 గంటలవరకు, కవితల పోటీ 11.30నుండి 1.00 వరకు జరుగుతుంది. రెండు విభాగాల్లో విజేతలకు నగదు బహుమతులతో పాటు, జ్ఞాపిక ప్రశంసా పత్రం అందచేస్తామని, పాల్గొన్న ప్రతి విద్యార్థికి కూడా ప్రశంసా పత్రాలను అందచేస్తామని వివరించారు. ఆసక్తిగల విద్యార్థులు +91-9440024471 నెంబరును సంప్రదించి 15 వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

    చదవండి :  సియ్యల పండగ (కథ) - తవ్వా ఓబుల్‌‌రెడ్డి

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *