కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల_ – అన్నమయ్య సంకీర్తన

కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల_ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల_
కీలువదలె సౌజన్యము కిందయిపోయినది
॥చ1॥
ఇందెక్కడిసంసారం, బేదెసఁ జూచిన ధర్మము
కందయినది,విజ్ఞానము కడకుఁ దొలంగినది,
గొందులు దరిఁబడె, శాంతము కొంచెంబాయ,వివేకము
మందుకు వెదకినఁ గానము మంచితనంపుఁబనులు
॥చ2॥
మఱి యిఁక నేఁటివిచారము, మాలిన్యంబైపోయిన_
వెఱుకలు, సంతోషమునకు నెడమే లేదాయ,
కొఱమాలెను నిజమంతయు,కొండలకేఁగెను సత్యము,
మఱఁగైపోయను వినుకులు, మతిమాలెను తెలివి
॥చ3॥
తమకిఁక నెక్కడిబ్రదుకులు, తడఁబడె నాచారంబులు,
సమమైపోయిన వప్పుడె జాతివిడంబములు ,
తిమిరంబింతయుఁ బాపఁగఁ దిరువేంకటగిరిలక్ష్మీ-
రమణుఁడు గతిదప్పను కలరచనేమియు లేదు
రాగము: సామంతం
రేకు: 0010-03
సంపుటము: 1-63

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  ఏవం శ్రుతిమత మిదమేవ త-

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: