
కాకున్న సంసారగతులేల – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కాకున్న సంసారగతులేల లోకకంటకములగు లోభంబులేల ॥చ1॥ వినికిగనవలసినను విష్ణుకీర్తన చెవికి వినికిచేసిన నదియె వేదాంతబోధ మనికిగనవలసినను మధువైరిపై భక్తి వునికి ప్రాణులకు బ్రహ్మోపదేశంబు ॥చ2॥ చదువు గనవలసినను శౌరినామము దిరుగఁ జదువుటే సకలశాస్త్రముల సమ్మతము నిదుర గనవలసినను నీరజాక్షునికిఁ దన- హృదయసమర్పణ సేయుటిది యోగనిదుర ॥చ3॥ ఆస వలసిన వేంకటాధీశ్వరుని కృపకు- నాససేయుటే పరమానందసుఖము వాసి గనవలసినను వైష్ణవాగారంబు వాసి సేయుట తనకు వైభవస్ఫురణ |
రాగము: శ్రీరాగం రేకు: 0063-05 సంపుటము: 1-326 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం