
కలలోని సుఖమే కలియుగమా,వెన్న
॥పల్లవి॥ కలలోని సుఖమే కలియుగమా,వెన్న కలిలో నెక్కడిదె కలియుగమా ॥చ1॥ కడిగడి గండమై కాలము గడపేవు కడుగఁగడుగ రొంపి కలియుగమా బడలికె వాపవు సరమేదో చూపవు గడిచీటియును నీవు కలియుగమా ॥చ2॥ కరపేపు కఱతలే మఱపేవు మమతలే కరకఱ విడువవు కలియుగమా తెరచీర మఱఁగింతే తెరువేల మూసేవు గరునేల దాఁటేవో కలియుగమా ॥చ3॥ కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు కానీలే కానీలే కలియుగమా పైనిదే వేంకటపతి దాసులుండఁగ కానవా నీ విదేమి కలియుగమా |
రాగము: సామంతం రేకు: 0019-06 సంపుటము: 1-118 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం