
Sub-Junior National Kabaddi Championship (file photo)
కబడ్డీ జాతీయ పోటీలకూ మనోళ్ళు!
కబడ్డీ సబ్‌జూనియర్స్ జాతీయస్థాయి చాంపియన్షిప్ పోటీలకు వీరపునాయునిపల్లె జూనియర్ కళాశాలలో చదువుతున్న ఎ.అపర్ణ, రైల్వేకోడూరు ఎస్.వి.జూనియర్ కళాశాలలో చదువుతున్న కె.ప్రశాంత్ ఎంపికైనట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సీఆర్ఐ సుబ్బారెడ్డి, చిదానందగౌడ తెలిపారు.
గత నెల 16 నుంచి 19వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన 26వ సబ్‌జూనియర్స్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో వీరు ప్రతిభ చూపడంతో మొదట ప్రాబబుల్స్‌కు ఎంపికచేశారన్నారు.
కాకినాడలో అక్టోబరు 24 నుంచి నవంబరు 4వ తేదీ వరకు ప్రాబబుల్స్‌కు ఎంపికైన క్రీడాకారులకు నిర్వహించి శిక్షణలో ప్రతిభ కనబరచడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారని చెప్పారు.