కదిరి చిన్నదానా …. జానపదగీతం

యువతి వర్ణ చిత్రము (గూగుల్ నుండి స్వీకరించబడినది)

కదిరి చిన్నదానా …. జానపదగీతం

వర్గం: యాలపాట

పాడటానికి అనువైన రాగం: మాయా మాళవ గౌళ (త్రిశ్ర ఏకతాళం)

కదిరి చిన్నదానా
కదిరేకు నడుముదానా
నిన్నెట్ల మరచుందునే
మరదల మాణిక్యమా ||కదిరి||

నీ సిల్కు సీరెకు
రేణిగుంట్ల రేయికాకు
నిన్నెట్ల మరచుందునే
మరదల మాణిక్యమా ||కదిరి||

నీ సైజు చేతులకు
సైదాపురం గాజులకు
నిన్నెట్ల మరచుందునే
మరదల మాణిక్యమా ||కదిరి||

పులివెందుల పూలాకు
నీ వాలు జడలాకు
నిన్నెట్ల మరచుందునే
మరదల మాణిక్యమా ||కదిరి||

ముద్దనూరి ముద్దులకు
నీ సన్న పెదవులకు
ముద్దెట్ల మరచుందునే
మరదల మాణిక్యమా ||కదిరి||

చదవండి :  పచ్చొడ్లు నే దంచి...పాలెసరు బెట్టీ - జానపదగీతం

తిరుపతి పోదాము
తిరుణాల చూపిస్తా
నిన్నెట్ల మరచుందునే
మరదల మాణిక్యమా ||కదిరి||

పాటను సేకరించినవారు: కీ.శే.కలిమిశెట్టి మునెయ్య

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *