కడుపెంత తాఁ గుడుచు కడుపెంత దీనికై – అన్నమయ్య సంకీర్తన

కడుపెంత తాఁ గుడుచు కడుపెంత దీనికై – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
కడుపెంత తాఁ గుడుచు కడుపెంత దీనికై
పడనిపాట్ల నెల్లఁబడి పొరలనేలా
॥చ1॥
పరులమనసునకు నాపదలు గలుగఁగఁజేయఁ
బరితాపకరమైనబ్రదుకేలా
సొరిది నితరుల మేలుచూచి సైఁపఁగలేక
తిరుగుచుండేటి కష్ట దేహమిదియేలా
॥చ2॥
యెదిరి కెప్పుడుఁ జేయుహితమెల్లఁ దనదనుచు
చదివిచెప్పనియట్టి చదువేలా
పొదిగొన్నయాసలోఁ బుంగుడై సతతంబు
సదమదంబై పడయుచవులు దనకేలా
॥చ3॥
శ్రీవేంకటేశ్వరుని సేవారతికిఁగాక
జీవనభ్రాంతిఁ బడుసిరులేలా
దేవోత్తముని నాత్మఁ దెలియనొల్లక పెక్కు_
త్రోవ లేఁగిన దేహి దొరతనంబేలా
రాగము: గుండక్రియ
రేకు: 0049-05
సంపుటము: 1-302

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియ

చదవండి :  ఆడరాని మాటది - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: