కడునడసు చొరనేల కాళ్ళు గడుగఁగనేల – అన్నమయ్య సంకీర్తన

కడునడసు చొరనేల కాళ్ళు గడుగఁగనేల – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
కడునడసు చొరనేల కాళ్ళు గడుగఁగనేల
కడలేని జన్మసాగర మీఁదనేల
॥చ1॥
దురితంబునకు నెల్లదొడవు మమకారంబు_
లరిదిమమతలకుఁ దొడ వడియాసలు
గురుతయిన యాసలకుఁ గోరికలు జీవనము
పరగ నిన్నిటికి లంపటమె కారణము
॥చ2॥
తుదలేని లంపటము దుఃఖహేతువు దుఃఖ_
ముదుటయిన తాపమున కుండఁగఁ జోటు
పదిలమగు తాపంబు ప్రాణసంకటము లీ-
మదము పెంపునకుఁ దనమనసు కారణము
॥చ3॥
వెలయఁ దనమనసునకు వేంకటేశుఁడు గర్త
బలిసి యాతనిఁ దలఁచుపనికిఁ దాఁ గర్త
తలకొన్న తలఁపు లివి దైవమానుషముగాఁ
దలఁచి యాత్మేశ్వరునిఁ దలఁపంగ వలదా
రాగము: ముఖారి
రేకు: 0041-03
సంపుటము: 1-251

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి

చదవండి :  పాపినైననాపాలఁ గలిగి తోవ - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *