
కడగనుటే సౌఖ్యముగాక యీ- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కడగనుటే సౌఖ్యముగాక యీ- తడతాఁకుల నెందరు చనరిట్లా ॥చ1॥ నిలిచినదొకటే నిజమని తెలిసిన- తెలివే ఘన మింతియకాకా కలకాలము చీఁకటి దవ్వుకొనెడి- వలలభ్రమల నెవ్వరు వడ రిట్లా ॥చ2॥ పరహిత మిదియే పరమని తెలిసిన పరిపక్వమె సంపదగాకా దురితవిధుల గొందుల సందులఁ బడి ధరలోపల నెందరు చనరిట్లా ॥చ3॥ ఘనుఁడీ తిరువేంకటపతి యని కని కొనకెక్కుట తేఁకువగాకా పనిమాలిన యీపలులంపటముల తనువు వేఁచు టెంతటిపని యిట్లా |
రాగము: పాడి రేకు: 0042-06 సంపుటము: 1-260 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడి