
కంటే సులభ మిది కానక యుంటే దుర్లభ: – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కంటే సులభ మిది కానక యుంటే దుర్లభ: మింటిలోననే వున్న దిహముఁ బరమును ॥చ1॥ హరిదాసులు మెట్టినక్కడే పరమపద- మరయ నిందుకంటె నవల లేదు తిరమై వీరి పాదతీర్థమే విరజానది సొరిది నన్ని చోట్లు చూచినట్టే వున్నది ॥చ2॥ మిచ్చక వైష్ణవుల మాటలెల్లా వేదములు యిచ్చల నిందుకంటే నింక లేదు అచ్చట వీరిపస్రాద మమృతపానములు అచ్చమై తెలిసేవారి కఱచేత నున్నది ॥చ3॥ చెలఁగి ప్రపన్నుల సేవే విజ్ఞానము ఫల మిందుకంటే మఱి పైపై లేదు తలఁప శ్రీవేంకటేశుదాసులే యాతనిరూపు- లెలమి నెదుట నున్నా రెఱిఁగినవారికి |
రాగము: ముఖారి రేకు: 0096-03 సంపుటము: 1-479 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి