
ఓ స్వయం ప్రకటిత మేధావీ…
ఓ స్వయం ప్రకటిత మేధావీ గారు.. చాల్లే చూశాం గానీ…
కొన్నేళ్ల క్రితం వరకు మేధావులంటే చాలా అంచనాలుండేవి. మేధావులు ప్రపంచానంతా ఒక యూనిట్ గా చూస్తారని అనుకునే వాడిని. వారికి ప్రాంతాలు, కులాలు, మతాలతో సంబంధం ఉండదనుకునే వాడిని. కానీ ఏపీలో స్వయంప్రకటితులుగా వెలసిన కొందరు మేధావులను చూశాక మేధావుల వెనుక కూడా మర్మాలుంటాయని అర్థమైంది.
చలసాని శ్రీనివాసరావు. సమాజం గౌరవించదగ్గ వ్యక్తి. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పగానే జనం కోసం నడుం బిగించారు. 13 జిల్లాలు ఉండగా ఆయన నిరసన ధర్నాకు రాయలసీమలోని అనంతపురం జిల్లానే ఎంచుకున్నారు. ప్రత్యేక హోదా రాకపోతే రాయలసీమ దెబ్బతింటుందని వాపోతున్నారు. చలసానిగారు…
1. ప్రత్యేక హోదా వచ్చినా ఆ నిధులు, పరిశ్రమలు ఎక్కడికి వెళ్తాయో మాకు తెలుసు. మీరు వచ్చి సీమ జనానికి చెప్పాల్సిన అవసరం ఉందంటారా?
2. జనంలో స్పూర్తి నింపి, చైతన్యం కలిగించేందుకు అనంతపురం వచ్చాం అని మాత్రం చెప్పవద్దు. ఎందుకంటే ప్రత్యేక ఉద్యమ సమయంలో 13 జిల్లాల కంటే ఉదృతంగా ఫైట్ చేసిన జిల్లా అనంతపురం జిల్లా. కాబట్టి మీరొచ్చి మంత్రజలం చల్లి నిద్రలేపాల్సిన అవసరం లేదు. సమైక్యాంధ్ర కోసం అంత ఫైట్ చేసినా అనంతపురం జిల్లాకు మిగిలింది ఏంటో తెలుసా.. అమరావతికి అత్యంత దూరమైన జిల్లా అన్న పేరు.
3. అయినా ప్రత్యేక హోదా రావాంటే ప్రధాని ఇంటి ముందో, లేక సీఎం ఇంటి ముందో ఇంకా కావాలంటే అపోజిషన్ లీడర్ల ఇంటి ముందో ధర్నాలు చేయాలి గానీ. అనంతపురం క్లాక్ టవర్ దగ్గర ధర్నా చేస్తే ఏమొస్తుంది?. 48 డిగ్రీల ఎండలో డీహైడ్రేషన్ తప్పా.
4. రాయలసీమ కోసం పరితపిస్తున్న మీ హృదయం ఇక్కడి జనం నీళ్లు లేక అలమటిస్తుంటే స్పందించలేదెందుకో? . 845 అడుగుల నీటి మట్టం శ్రీశైలంలో ఉంటేనే రాయలసీమకు నీరందుతాయి. మరీ కరెంట్ ఉత్పత్తి పేరుతో తాగు నీటి పేరుతో శ్రీశైలం నీటి మట్టం 780కి పడగొట్టారు కదా!. అలాచేయడం వల్ల రాయలసీమ నాశనం అవుతుందని ఇంత స్థాయిలో బాధ్యత ప్రదర్శిస్తున్న మీకు అర్థం కాలేదా?
5. రాయలసీమ వాళ్లు తాగేందుకు నీరు లేవు. కాబట్టి శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగు ఉంచండి అని ఏ టీవీ చర్చలోనూ మీరు చెప్పినట్టు సీమ జనం వినలేదే.
6. మేధావితనం ప్రదర్శనకు తెలంగాణ లేదు కాబట్టి… ఇప్పుడు సీమ మీడ పడ్డారా?.
7. సీమలో మేధావులు లేరు… సీమ తరపున పోరాటం చేసేందుకు ఎవరూ లేరు అన్నట్టు వచ్చి అనంతపురం టవర్ క్లాక్ వద్ద మీరు ధర్నాలు చేయడం అవసరమా?
8. రాయలసీమ మీద ఇప్పుడు నడుస్తున్న ఆధిపత్యం చాలు. ఇక మేధావి అధిపత్యం కూడా చలాయించి రక్తం తాగవద్దు.
9. థర్డ్ పార్టీ రాజకీయాలు ఎలా నడుస్తాయో… వాటికి కొందరు మేధావులు తెర వెనుక ఎలా ఉపయోగపడుతారో అందరికీ తెలుసు. రాయలసీమ కోసం నటించడం మానండి.