
ఒప్పులై నొప్పులై వుండుఁగాన
॥పల్లవి॥ ఒప్పులై నొప్పులై వుండుఁగాన అప్పటప్పటికిఁ జూడ నదియేకా నిజము ॥చ1॥ కన్నుల కిన్నియుఁజూడ కలలై వలలై వున్నతాలు నడ్డాలై వుండుఁగాన చిన్న చిన్న చిటిపొటి చిమ్ముదొమ్ముదిమ్ములవి వున్నవన్నియుఁ జూడ నొకటేకా నిజము ॥చ2॥ సారేకు నోరికిఁ జూడ చవులై నవ్వులై పూరటమాటలై వుండుఁగాన తారుమారు తాఁకు సోఁకు తప్పుదోఁపు లిన్నియు వోరపారులేనివెల్ల వొక్కటెకా నిజము ॥చ3॥ మేనికి నిన్నియుఁ జూడ మృదువై పొదువై పూని సంపదలై వుండుఁగాన తేనై తీపై తిరువేంకటేశ నిన్ను కానవచ్చినదే వొక్క టేకా నిజము |
రాగము: దేసాక్షి రేకు: 0025-01 సంపుటము: 1-149 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, దేసాక్షి