మార్చి 26 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట కోదండ రామాలయం

మార్చి 26 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట: కోదండరాముని శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మార్చి 27వ తేదీతో ప్రారంభమై, ఏప్రిల్ 6తో ముగియనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తారు. బ్రహ్మోత్సవాల గోడపత్రాలను ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆదివారం విడుదలచేశారు. ముఖ్యమంత్రికి స్వయంగా ఒంటిమిట్ట కోదండరాముడి గురించి తాను వివరించానన్నారు. ఒంటిమిట్ట, రామతీర్థం ఆలయాలకు సంబంధించిన నివేదకలను తెప్పించుకొని, పరిశీలించిన పిదప ప్రభుత్వ లాంచనాల విషయంలో ఓ నిర్ణయానికి వద్దామని సీఎం చెప్పారన్నారు.

చదవండి :  అన్నమయ్య 512వ వర్థంతి ఉత్సవాలు మొదలైనాయి

రామాలయానికి దాతల సహకారంతో ఒంటిమిట్ట కొదందరామాలయంలో పలు సదుపాయాలు కల్పించారు. వీటిని మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. వసతిగృహ పునరుద్ధరణకు గజ్జల రామచంద్రారెడ్డి, శాశ్వత క్యూలైను ఏర్పాటుకు మేడా రామకృష్ణారెడ్డి, ఉరిమి జనార్థనరెడ్డి, యల్లారెడ్డి, బోరు ఏర్పాటుకు గజ్జల మనోహరరెడ్డి, మోటారుకు రాంప్రసాద్, ఎమ్ఎస్ దీపాల ఏర్పాటుకు శనివారపు శంకర్‌రెడ్డి, స్వామివారి ఏకాంతసేవ మంచం కోసం చెంగయ్య, సీసీ కెమెరాల ఏర్పాటు కోసం శ్రీనివాసులరెడ్డి ఆర్థిక సహకారం అందించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వీరిని మేడా సత్కరించారు. దేవాలయాల అభివృద్ధికి దాతల సహాయం ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనరు శంకర్‌బాలాజీ, మండల తెదేపా నాయకులు పాల్గొన్నారు.

చదవండి :  ఈ రోజూ రేపూ ఇస్తిమా

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *