ఒంటిమిట్టలో రోడ్ల పునరుద్ధరణకు 45లక్షలు

ఒంటిమిట్ట కోదండ రామాలయం

ఒంటిమిట్టలో రోడ్ల పునరుద్ధరణకు 45లక్షలు

కడప: ఒంటిమిట్ట కోదండరామాలయం సమీపంలోని రోడ్లు పునరుద్ధరించేందుకు, అలాగే రథం తిరిగే రోడ్డు వెంబడి మరమ్మతులు చేసేందుకు గాను ప్రభుత్వం 45 లక్షల రూపాయలను  (G.O.RT.No. 242) మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం పేర (పంచాయతీ రాజ్ శాఖ) కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి  జీవో నెంబరు 242ను మార్చి 11న విడుదల చేశారు.

ఇందులో 40 లక్షల రూపాయలను వెచ్చించి వాహనశ్రేణి (విఐపి) తిరిగేందుకు వీలుగా ఆలయ సమీపంలోని రోడ్లను పునరుద్ధరిస్తారు. మిగతా ఐదు లక్షల రూపాయలను రథం తిరిగే దోవలో గుంతలను పూడ్చేదానికి, ఇతర పనుల కోసమూ వినియోగించాల్సి ఉంది.

చదవండి :  బ్రహ్మంగారిమఠంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

ఫిబ్రవరి 21న పంచాయత్ రాజ్ చీఫ్ ఇంజనీరు పంపిన ప్రతిపాదనలను అనుసరించి ఈ నిధులను మంజూరు చేస్తున్నట్లు, అందుకు సంబంధించిన పరిపాలనాపరమైన అనుమతులను ఇస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

జీవో నెంబరు 242 ప్రతిని చూసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *