అన్నమాచార్యుడు – తొలి తెలుగు వాగ్గేయ కారుడు, పద కవితా పితామహుడు. బాషలో, భావంలో- విలక్షణత్వాన్ని, వినూత్నత్వాన్నీ చేర్చి పాటకు ప్రాణ ప్రతిష్ట చేసినాడు. తన పల్లవీ చరణాలతో వేంకటపతిని దర్శించిన అన్నమయ్య ఒంటిమిట్ట కోదండ రామయ్యను ఇలా కీర్తిస్తున్నాడు..
జయ జయ రామా సమరవిజయ రామా
భయహర నిజభక్తపారీణ రామా
జలధిబంధించిన సౌమిత్రిరామా
సెలవిల్లువిరచినసీతారామా
అలసుగ్రీవునేలినాయోధ్యరామా
కలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా
అరిరావణాంతక ఆదిత్యకులరామా
గురుమౌనులను గానేకోదండరామా
ధర నహల్యపాలిటిదశరథరామా
హరురాణినుతులలోకాభిరామా.
అతిప్రతాపముల మాయామృగాంతక రామా
సుతకుశలవప్రియ సుగుణ రామా
వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా
మతిలోనబాయనిమనువంశరామా