
ఏల పొరలేవులేవే యింతలోనిపనికి
॥పల్లవి॥ ఏల పొరలేవులేవే యింతలోనిపనికి మాలయింటితోలుకప్పుమాయ లిటువంటివి ॥చ1॥ చిక్కులతమకముల చీఁకటిగప్పిననాఁడు యెక్కువ వాసనలౌ హేయపుమేను వెక్కసపు ప్రియమది విరిగితే రోఁతలౌ లక్కపూఁతకపురు లీలాగు లిటువంటివి ॥చ2॥ మించినచిత్తములో మేలుగలిగిననాఁడు యెంచరానిచవులౌ నెంగలిమోవి పెంచుకంటే కష్టమౌ ప్రియముదీరిననాఁడు చంచలపు చిత్తములచంద మిటువంటిది ॥చ3॥ వెల్లి గొనుసురతపువేళ మరపులయింపు కొల్లలాడుటౌ కొనగోరితాఁకులు నల్లితిండౌ మరి మీఁద మరగితే రోఁతలౌ వుల్లమిచ్చే వేంకటేశువొద్ది కిటువంటిది |
రాగము: ముఖారి రేకు: 0031-02 సంపుటము: 1-189 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారి