ఏలవచ్చీ యేలపోయీ నెందుండీ – అన్నమయ్య సంకీర్తన

ఏలవచ్చీ యేలపోయీ నెందుండీ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఏలవచ్చీ యేలపోయీ నెందుండీఁ బ్రాణి
తోలుతి త్తిలోనఁ జొచ్చి దుంక దూరనా
॥చ1॥
పుట్టులేక నరకాలపుంగుడై తా నుండక యీ-
పుట్టుగున కేల వచ్చీ పోయీఁ బ్రాణి
పుట్టుచునే కన్న వారిఁ బుట్టినవారి నాసలఁ
బెట్టిపట్టి దు: ఖములఁ బెడరేఁచనా
॥చ2॥
భూతమై యడవిలోఁ బొక్కుచుఁ దా నుండక యీ-
బూతుజన్మమేల మోఁచెఁ బుచ్చిన ప్రాణి
రాతిరిఁబగలు ఘోరపుఁబాటు వడిపడి
పాతకాలు చేసి యమబాధఁబడనా
॥చ3॥
కీటమై వేంకటగిరి కిందనైన నుండక యీ-
చేటువాటుకేల నోఁచె చెల్లఁబో ప్రాణి
గాటమైనసంపదల కడలేనిపుణ్యాల-
కోటికిఁ బడగెత్తక కొంచెపడనా
రాగము: భూపాళం
రేకు: 0049-02
సంపుటము: 1-299

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భూపాళం

చదవండి :  బయలు వందిలి వెట్టి పరగఁ జిత్తముగలిగె

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: