
ఏమి సేసినా నీరుణ మెట్టు వాసును – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఏమి సేసినా నీరుణ మెట్టు వాసును కామితఫలద వోకరుణానిధి ॥చ1॥ చేరి కర్మములు నన్ను చెఱవట్టుకుండగాను పేరువాడి వచ్చి విడిపించుకొంటివి సారె తగవట్టె కాదా శక్తిగలవారెల్లా నారయ దీనులఁ గంటే నడ్డమై కాతురు ॥చ2॥ అరులు పంచేంద్రియము లందు నిందుదియ్యఁగాను వెరవుతోడ వెనక వేసుకొంటివి పరగ నట్టేకాదా బలువులైనవారు అరయఁ బేదలకైన ఆపద మానుతురు ॥చ3॥ పలుజన్మములే నన్ను పరి అరికట్టుకోఁగా తొలగదోసి నాకు దోడైతివి యెలమి శ్రీవేంకటేశ యిల శూరులైనవారు బలుభయ మిందరికిఁ బాపుచుందురు |
రాగము: లలిత రేకు: 0095-05 సంపుటము: 1-475 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత