
ఏమి నేయువార మిఁకను – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఏమి నేయువార మిఁకను ఆమని చేలపచ్చలాయ బ్రదుకు ॥చ1॥ దీపనమనియెడి తీరని యాస రేపుమాపుఁ బెడరేఁచఁగా తోపునేయఁగరాక దురితపుతరవుల – కాపదలకు లోనాయ బ్రదుకు ॥చ2॥ వేడుకనెడి పెద్దవిడువనితరవు వోడ కెపుడు వొద్దనుండఁగా జోడు విడువరాక చులుకఁదనంబున- కాడికెలకు లోనాయ బ్రదుకు ॥చ3॥ మమకారమనియెడిమాయతరవు తిమిర మెక్కించుక తియ్యఁగా విమలమూరితియైన వేంకటగిరిపతి అమరఁ జేరక యరవాయ బ్రదుకు |
రాగము: వరాళి రేకు: 0041-02 సంపుటము: 1-250 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, వరాళి