
ఏమి గలదిందు నెంత గాలంబైన
॥పల్లవి॥ ఏమి గలదిందు నెంత గాలంబైన పామరపు భోగ మాపదవంటి దరయ ॥చ1॥ కొండవంటిది యాస, గోడ వంటిది తగులు బెండువంటిది లోని పెద్దతనము పుండువంటిది మేను, పోలించినను మేడి_ పండువంటిది సరసభావమింతియును ॥చ2॥ కంచువంటిది మనసు, కలిమిగలదింతియును మంచువంటిది,రతి భ్రమతవంటిది మించువంటిది రూపు, మెలింతియును ముట్టు పెంచువంటిది,దీనిప్రియ మేమిభ్రాఁతి ॥చ3॥ ఆఁకవంటిది జన్మ, మడవివంటిది చింత పాఁకువంటిది కర్మ బంధమెల్ల యేఁకటను దిరువేంకటేశుఁ దలచినకోర్కి కాఁక సౌఖ్యములున్న గనివంటి దరయ |
రాగము: శ్రీరాగం రేకు: 0018-06 సంపుటము: 1-112 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగం