ఏమియుఁ జేయఁగవద్దు యింతలోనె మోక్షము – అన్నమయ్య సంకీర్తన

ఏమియుఁ జేయఁగవద్దు యింతలోనె మోక్షము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఏమియుఁ జేయఁగవద్దు యింతలోనె మోక్షము
దీమపువిజ్ఞానమే దివ్వెత్తు ఫలము
॥చ1॥
పాపచింత మదిలోన బారకుండా నిలిపితే
చేపట్టి దానములెల్లా జేసినంత ఫలము
కోపానలములోన కోరికలు వేల్చితేనే
యేపున యజ్ఞాలు సేసి యేచినంత ఫలము
॥చ2॥
కనకముపై కాదని పోదొబ్బితేనే
తనకు వేవేలు ఘోరతపముల ఫలము
వనితలమోహములవలఁ బడకుండితేనే
దినము గోటితీర్థాలు దిరిగినఫలము
॥చ3॥
శ్రీవేంకటేశ్వరు జేరి కొలుచుటే
ధావతిలేని యట్టితనజన్మ ఫలము
భావించి యాచార్యపాదపద్మమూలమే
సావధానమున సర్వశాస్త్రార్థఫలము
రాగము: గుండక్రియ
రేకు: 0088-02
సంపుటము: 1-430

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియ

చదవండి :  చిత్తమో కర్మమో జీవుఁడో దేవుఁడో - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: