ఏదైవము శ్రీపాదన్నఖమునఁ బుట్టినగంగ

॥పల్లవి॥
ఏదైవము శ్రీపాదన్నఖమునఁ బుట్టినగంగ
త్రిలోకపావనము చేయను త్రిపథగామిని ఆయను
॥చ1॥
యేదైవమువురస్థలంబు దనకును మందిరమైన యిందిర
మాతయయ్యే యీజగంబుల కెల్లను
యేదైవము‌ అవలోకన మింద్రాదిది విజగణంబుల
కెల్లప్పుడును సుఖంబు లాపాదించును
॥చ2॥
యేదైవము దేహవస్తువని అనిమిషులందరుఁ గూడి
శ్రీనారాయణ దేవుండని నమ్మి యుండుదురు
ఆదేవుఁడే సిరుల కనంతవరదుఁడు తిరువేంకట-
గిరినాథుఁడుభయ విభూతినాథుఁడే నానాథుఁడు
రాగము: గీతం – నాట
రేకు: 0016-06
సంపుటము: 1-100

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు

చదవండి :  గడ్డపార మింగితే నాఁకలి దీరీనా యీ-

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *