ఏణ నయనల చూపులెంత సొబగైయుండు
॥పల్లవి॥ ఏణ నయనల చూపులెంత సొబగైయుండు ప్రాణ సంకటములగు పనులు నట్లుండు ॥చ1॥ ఎడలేని పరితాప మేరీతిఁ దానుండు అడియాస కోరికలు నటువలెనె యుండు కడలేని దుఃఖసంగతి యెట్లుఁ దానుండు అడరు సంసారంబు నట్లనే వుండు ॥చ2॥ చింతా పరంపరలఁ జిత్తమిది యెట్లుండు వంతఁ దొలఁగన మోహవశము నట్లుండు మంతనపుఁ బనులపయి మనసు మరియెట్లుండు కంతుశరమార్గముల గతి యట్లనుండు ॥చ3॥ దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండు శ్రీవేంకటేశు కృపచేత లట్లుండు భావగోచరమైన పరిణతది యెట్లుండు కైవల్యసౌఖ్య సంగతులు నట్లుండు | రాగము: నారణి రేకు: 0016-05 సంపుటము: 1-99 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నారణి