ఏఁటి విజ్ఞాన మేఁటి చదువు – అన్నమయ్య సంకీర్తన

ఏఁటి విజ్ఞాన మేఁటి చదువు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఏఁటి విజ్ఞాన మేఁటి చదువు
గూఁటఁబడి వెడలుగతిగురుతు గనలేఁడు
॥చ1॥
ఏడుమడుకలచర్మ మింతయునుఁ దూంట్లై
గాడఁబెట్టుచుఁజీము గారఁగాను
పాడైన యిందులో బ్రదుకుగోరీఁ బ్రాణి
వీడఁదన్ను కచనెడి వెరవు గనలేఁడు
॥చ2॥
కడుపునిండిన మహాకష్టంబు నలుగడల
వెడలుచును బెనుమురుకి వేయఁగాను
యిడుమఁ బొందుచు సుఖంబిందుకే వెదకీని
వొడలు మోవఁగ జీవుఁడోపననలేఁడు
॥చ3॥
వుదకమయమగుకన్ను లురికి యేమైనఁగని
మదవికారము మతికి మరుపఁగాను
యిది యెరిఁగి తిరువేంకటేశుఁగని జీవుఁడా-
సదమలానందంబు చవిగానలేఁడు
రాగము: గుండక్రియ
రేకు: 0013-01
సంపుటము: 1-77

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియ

చదవండి :  ఏఁటి విజ్ఞాన మేఁటి చదువు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: