ఎవ్వరివాఁడో యెఱఁగరాదు – అన్నమయ్య సంకీర్తన

ఎవ్వరివాఁడో యెఱఁగరాదు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఎవ్వరివాఁడో యెఱఁగరాదు
అవ్వలివ్వలిజీవుఁ డాటలో పతిమే
॥చ1॥
ధర జనించకతొలుత తనుఁ గానరాదు
మరణమందినవెనక మఱి కానరాదు
వురువడిదేహముతో నుండినయన్నాళ్లే
మరలుజీవునిబదు‌కు మాయవో చూడ
॥చ2॥
యిహములో భోగించు నిందుఁ గొన్నాళ్లు
మహిమ పరలోకమున మలయుఁ గొన్నాళ్లు
తహతహలఁ గర్మబంధములఁ దగిలినయపుడే
అహహ దేహికిఁ బడుచులాటవో బదుకు
॥చ3॥
సంతానరూపమై సాగు ముందరికి
కొంత వెనకటిఫలము గుడువఁ దాఁ దిరుగు
యింతటికి శ్రీవేంకటేశుఁడ డంతర్యామి
బంతి నితనిఁ గన్నదుకువో బదుకు
రాగము: గుండక్రియ
రేకు: 0095-02
సంపుటము: 1-472

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియ

చదవండి :  కింకదీర 'నదైవం కేశవాత్పర' మని - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: