
ఎవ్వరివాఁడో యీదేహి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎవ్వరివాఁడో యీదేహి యివ్వలనవ్వల నీదేహి ॥చ1॥ కామించు నూరకే కలవియు లేనివి యేమి గట్టుకొనె నీదేహి వాములాయ నిరువదియొక వావులు యేమని తెలిసెనో యీదేహి ॥చ2॥ కందువ నిజములు గల్లలు నడిపీ యెందుకు నెక్కెనో యీ దేహి ముందర నున్నవి మొగిఁ దనపాట్లు యిందే భ్రమసీ నీదేహి ॥చ3॥ పంచేంద్రియముల పాలాయ జన్మము యించుక యెఱఁగఁడు యీదేహి అంచెల శ్రీవేంకటాధీశ నీకృప వంచఁగ గెలిచెను వడి నీదేహి |
రాగము: దేసాక్షి రేకు: 0086-03 సంపుటము: 1-419 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేసాక్షి