
ఎవ్వరికైనను యీవ్రాఁత నను – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎవ్వరికైనను యీవ్రాఁత నను నవ్వులు సేసెఁబో నావ్రాఁత ॥చ1॥ తొలిజన్మంబున దోషకారియై నలుగడఁ దిప్పెను నావ్రాఁత యిల దుర్గణముల కీజన్మంబున – నలఁకువ నేనెఁబో నావ్రాఁత ॥చ2॥ పురుషునిఁజే శల్పుని ననిపించుట నరజన్మమునకు నావ్రాఁత తరుచయ్యినపాతక మరుపెట్టుక నరకము చూపెఁబో నావ్రాఁత ॥చ3॥ పామఱితనమున బహువేదనలను నామన సెనసెఁబో నావ్రాఁత కామితఫలు వేంకటపతినిఁ గొలిచి నామతి దెలిపెఁబో నావ్రాఁత |
రాగము: ముఖారి రేకు: 0038-03 సంపుటము: 1-233 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి