
ఎన్నఁడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎన్నఁడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే సన్నము దొడ్డునుఁ దోఁచీ సంసారఫలంబు ॥చ1॥ తిత్తితో నూరేండ్లకును దేహము పండఁగఁ బండఁగ చిత్తం బెన్నఁడు పండక చిక్కెను కసుఁగాయై పొత్తుల పుణ్యముఁ బాపము పులుసును తీపై రసమున సత్తు నసత్తునుఁ దోచీ సంసారఫలంబు ॥చ2॥ వెదవడి పుత్రులుపౌత్రులే విత్తులు లోలో మొలచియు పొది గర్మపుపూ మారదు పూపిందెయిన దిదే తుదనిదె సుఖమునుదుఃఖముతోలునుగింజయి ముదురుక చదురము వలయము తోఁచీ సంసారిఫలంబు ॥చ3॥ వినుకలిచదువుల సదలో వేమరు మాఁగఁగ బెట్టిన ఘనకర్మపుటొ గరుడుగదు కమ్మర పులిగాయై మనుమని శ్రీవేంకటేశుకు మహినాచార్యుఁడు కానుక చనవున నియ్యఁగ వెలసెను సంసారఫలంబు |
రాగము: మలహరి రేకు: 0096-06 సంపుటము: 1-482 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మలహరి