ఎట్టు వేగించె దిందుకేగురే సితరకాండ్లు – అన్నమయ్య సంకీర్తన

ఎట్టు వేగించె దిందుకేగురే సితరకాండ్లు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఎట్టు వేగించె దిందుకేగురే సితరకాండ్లు
వెట్టివేమి సేయుమంటా వెన్నడించే రిపుడు
॥చ1॥
వొంటికాలఁ గుంటికుంటి వూరిబందెలకుఁ జిక్కి
పంటదాఁకా దున్నె నొక్కపసురము
గంటుగంటులాక లొత్తి కల్లల నడిమిపంట
కుంటివాఁడు గావలుండి కుప్ప లేరుపరచె
॥చ2॥
కలది కుక్కిమంచము కన్నవారెల్లాఁ బండేరు
తలెతో దొగ్గినంబలి దావకూళ్ళు
వెలిఁగంతల కొంపలు వీడుఁబట్లు చూపేరు
తలవరులెందు లోనాఁ దప్పు వెదకేరు
॥చ3॥
వొళ్ళుచెడ్డవాఁ డొకఁడు వుభయమార్గము గొని
కల్లదొరపుట్టుబడి కడుఁగట్టీని
చల్లనిశ్రీవేంకటేశ సకలలోకపతివి
యిల్లిదె నీశరణంటి మిందరిని గావవే
రాగము: శ్రీరాగం
రేకు: 0078-01
సంపుటము: 1-370

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం

చదవండి :  ఎంత బోధించి యేమి సేసినఁ దన- - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: