
ఎట్టివారికినెల్ల నిట్టికర్మములు మా- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎట్టివారికినెల్ల నిట్టికర్మములు మా- యెట్టివారికి నింక నేది తోవయ్య ॥చ1॥ పాముఁజంపిన యట్టిపాతకమునఁ బెద్ద – పాముమీఁద నీకుఁ బవళించవలసె కోమలిఁ జంపిన కోఱఁతవల్ల నొక్క- కోమలి నెదఁ బెట్టుకొని యుండవలసె ॥చ2॥ బండి విఱిచినట్టి పాతకమునఁ బెద్ద బండిబోయుఁడవై పనిసేయవలనె కొండవెఱికి నట్టిగుణమునఁ దిరుమల- కొండమీఁద నీకుఁ గూచుండవలసె |
రాగము: సాళంగనాట రేకు: 0045-05 సంపుటము: 1-277 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సాళంగనాట