
ఎక్కడ చొచ్చడి దీభవమేదియుఁ గడపల గానము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎక్కడ చొచ్చడి దీభవమేదియుఁ గడపల గానము వుక్కునఁ బరితాపానల మూదక మండెడివి ॥చ1॥ హృదయవికారము మాన్పఁగ నేతెరఁగును సమకూడదు మదనానందము చెరుపఁగ మందేమియు లేదు పొదలినదేహగుణంబులఁ బోనడువఁగ గతి గానము బ్రదికించినకోరికెలకుఁ బ్రాయము దిరిగినది ॥చ2॥ కమలినయజ్ఞానం బిది కన్నులముందరఁ గానదు తిమిరము పొదిగొని చూడ్కికి దెరువేమియు లేదు తెమలనియాశాపాశము తెంపఁగ సత్వము చాలదు మమకారము వెడలింపఁగ మతి యెప్పుడు లేదు ॥చ3॥ దురితంబులు పుణ్యంబులు తొడిఁబడ నాత్మనుఁ బెనగొని జరగఁగ శరీరధారికి సత్కర్మము లేదు తిరువేంకటగిరిపతియగు దేవశిఖామణిపాదము శరణని బ్రదుకుటదప్పను సన్మార్గము లేదు |
రాగము: బౌళి రేకు: 0069-04 సంపుటము: 1-361 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి