ఎక్కడిపాపము లెక్కడిపుణ్యము – అన్నమయ్య సంకీర్తన

ఎక్కడిపాపము లెక్కడిపుణ్యము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఎక్కడిపాపము లెక్కడిపుణ్యము
లొక్కట గెలిచితి మోహో నేము
॥చ1॥
ప్రపన్నులెదుటను బడినయాతుమకు
చపలత మరి నాశము లేదు
ఉపమల గురుకృప నొనరిన మనసుకు
రపముల మఱి నేరములే లేవు
॥చ2॥
ఘనతర ద్వయాధికారగు దేహికి
మినుకుల భవభయమే లేదు
చనవుల హరిలాంఛన కాయమునకు
వెనుకొను కర్మపువెట్టియు లేదు
॥చ3॥
శ్రీవేంకటేశ్వరుఁ జేరినధర్మికి
ఆవల మఱి మాయలు లేవు
కైవశమాయను కైవల్యపదమునుఁ
జావుముదిమితో సడ్డే లేదు
రాగము: గుజ్జరి
రేకు: 0084-04
సంపుటము: 1-408

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుజ్జరి

చదవండి :  ఏపనులు సేసినా నిటువలెనేపో - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: