ఎందుఁ బొడమితిమో యెఱఁగము మా-

॥పల్లవి॥
ఎందుఁ బొడమితిమో యెఱఁగము మా-
కందువ శ్రీహరికరుణేకాక
go
॥చ1॥
ఏఁటిజన్మమో యెఱఁగము పర-
మేఁటిదో నే మెఱఁగము
గాఁటపుకమలజుఁ గాఁచినయీ
నాఁటకుఁడే మానమ్మినవిభుఁడు
॥చ2॥
యెవ్వారు వేల్పులో యెఱఁగము సుర
లెవ్వరో నే మెఱఁగము
రవ్వగు శ్రీసతిరమణుఁడు మా-
కవ్వనజోదరుఁ డంతరియామి
॥చ3॥
యింకానేఁటిదో యెఱఁగము యీ –
యంకెలబాముల నలయము
జంకెల దనుజులఁ జదిపినతిరు-
వేంకటేశుఁడు మావిడువనివిభుఁడు
రాగము: ముఖారి
రేకు: 0014-01
సంపుటము: 1-83

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారి

చదవండి :  ఘటికాద్రి హట యోగానంద భజన సంకీర్తనలు - కడప నారాయణదాసు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *