
ఎందుఁ జూచినఁ దనకు నిన్నియును నిట్లనే – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎందుఁ జూచినఁ దనకు నిన్నియును నిట్లనే కందులేనిసుఖము కలనైన లేదు ॥చ1॥ సిరులు గలిగిన ఫలము చింతఁ బొరలనె కాని సొలది సంతోష మించుకయైన లేదు తరుణి గల ఫలము వేదనలఁ బొరలుటె కాని నెరసులేని సుఖము నిమిషంబు లేదు ॥చ2॥ తనువుగల ఫలము పాతకము సేయనె కాని అనువైన పుణ్యంబు అది యింత లేదు మనసుగల ఫలము దుర్మతిఁబొందనే కాని ఘనమనోజ్ఞాన సంగతి గొంత లేదు ॥చ3॥ చదువుగలిగిన ఫలము సంశయంబే కాని సదమల జ్ఞాననిశ్చయ మింత లేదు యిది యెరిఁగి తిరువేంకటేశ్వరునిఁ గొలిచినను బ్రదుకు గలుగును భవము ప్రాణులకు లేదు |
రాగము: శుద్దవసంతం రేకు: 0066-01 సంపుటము: 1-340 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శుద్దవసంతం