
ఎందరివెంట నెట్లఁ దిరుగవచ్చు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎందరివెంట నెట్లఁ దిరుగవచ్చు కందువెఱిఁగి చీఁకటిదవ్వుకొనుఁగాక ॥చ1॥ తల రాయిగాఁగ నెందరికి మొక్కెడిని తెలివిమాలినయట్టిదేహి కొలఁదిమీరినదేవకోట్లు దనలోన కలవాని నొక్కనినే కొలుచుఁగాక ॥చ2॥ కాలీచపడఁగ నెక్కడికి నేఁగెడిని పాలుమాలినయట్టిప్రాణి మేలిమిజగములు మేనిలోఁ గలవాఁడు పాలిటివాఁడై ప్రణుతికెక్కుఁగాక ॥చ3॥ నూరేండ్ల నెందరి నుతియింపఁ గలవాఁడు చేరఁదావులేనిజీవి శ్రీరమణీశుఁడు శ్రీవేంకటేశుని కోరికెఁ దలఁచి నుతి కొల్ల గొనుటగాక |
రాగము: దేవగాంధారి రేకు: 0032-07 సంపుటము: 1-201 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారి