ఎంతమానుమన్నఁ జింతలేల మానునే – అన్నమయ్య సంకీర్తన

ఎంతమానుమన్నఁ జింతలేల మానునే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఎంతమానుమన్నఁ జింతలేల మానునే
పంతపుమనసు హరిపై నుంటేఁగాక
read
॥చ1॥
తీరని బంధాలు నేఁడే తెగుమంటే నేల తెగు
భారపుమమతఁ బెడఁబాసినఁగాక
వూరటగా మమత నేనొల్లనంటే నేల మాను
వోరువుతో లంపటము లొల్లకుంటేఁగాక
॥చ2॥
వేఁకపుఁగోపము నేఁడే విడుమంటే నేల విడు
తోఁకచిచ్చయినయాసఁ దుంచినఁగాక
ఆఁకట నానేల మాను అన్నిటాను యిందరికి
మాఁకుపడి తత్తరము మఱచుంటేఁగాక
॥చ3॥
పెట్టనిది దైవ మిట్టే పెట్టుమంటే నేల పెట్టు
యిట్టే వేంకటపతి యిచ్చినఁగాక
యిట్టునట్టు నీతఁడు దా నిందరికి నేల యిచ్చు
వొట్టినవిరక్తి నేమి నొల్లకుంటేఁగాక
రాగము: ముఖారి
రేకు: 0033-03
సంపుటము: 1-204

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి

చదవండి :  ఇందిర వడ్డించ నింపుగను

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *