
ఎంతనేయఁగలేదు యిటువంటివిధి యభవు-
॥పల్లవి॥ ఎంతనేయఁగలేదు యిటువంటివిధి యభవు- నంతవానిని భిక్షమడుగు కొనఁ జేసె open ॥చ1॥ కోరి చంద్రునిఁ బట్టి గురుతల్ప గునిఁ జేసె కూరిమలరఁగ నింద్రుఁ గోడిఁ జేసె ఘోరకుడువఁగఁ ద్రిశంకుని నంత్యజునిఁ జేసె వీరుఁడగునలుఁ బట్టి విద్రూపుఁ జేసె ॥చ2॥ అతివ నొడ్డుగఁ జూదమాడ ధర్మజుఁ జేసె సతి నమ్ముకొన హరిశ్చంద్రుఁ జేసె కుతిలపడ శూద్రకుని గొఱ్ఱెముచ్చుగఁ జేసె మతిమాలి కురురాజు మడుఁగుచొరఁ జేసె ॥చ3॥ పడనిపాట్ల బరచి బ్రహ్మతల వోఁజేసె తొడరి కాలునికాలు దునియఁ జేసె ఆడర నీవిధికి విధియగు వేంకటేశుకృప పడయకుండఁగ భంగపడకపోరాదు |
రాగము: ముఖారి రేకు: 0022-04 సంపుటము: 1-134 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారి